• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భార్యపై కోపంతో భర్త సూసైడ్ అటెంప్ట్

HYD: సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు.

February 10, 2025 / 07:23 AM IST

పెదనందిపాడులో దట్టంగా కురిసిన పొగ మంచు

GNTR: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఉదయం భారీగా మంచు కురిసింది. తెల్లవారుజాము నుంచే మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలకు లైట్లు వేసుకుని నిదానంగా వెళ్లారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షంలా మంచు కురవడంతో ఉదయాన్నే పనులకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు.

February 10, 2025 / 07:20 AM IST

జగన్ ఇంటి వద్ద కెమెరాలు ఏర్పాటు

GNTR: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానిటర్ చేయనున్నారు.

February 10, 2025 / 07:12 AM IST

నాగలూటిలో కృష్ణ జింక మృతి

NDL: నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలోని నాగలూటిలో ఆదివారం రాత్రి కృష్ణ జింక మృతి చెందింది. గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కృష్ణ జింక జనావాసాలు చూసి బెదిరి ఊర్లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. అదుపు తప్పి ఇంటి గోడను తగిలి కిందపడి, అక్కడే మృతి చెందింది. జింక మృతిపై గ్రామస్తులు రోళ్లపాడు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది.

February 10, 2025 / 07:08 AM IST

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్టు

KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామ శివారులో ఆదివారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బోయ ఓబులమ్మను ఎస్సై మల్లికార్జున అరెస్టు చేశారు. ఈమె వద్ద నుంచి 180 ఎంఎల్ పరిమాణంలో 20 మ్యాన్సన్ హౌస్, 25 బ్రాందీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

February 10, 2025 / 07:03 AM IST

విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి

KRNL: మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రికి చెందిన 42 ఏళ్ల రైతు బోయ కపటి నరసింహులు ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామంలో బంగారమ్మ దేవర మహోత్సవాల ఏర్పాట్లలో పాల్గొంటున్న నరసింహులు ఇంటి వద్ద శుభ్రం చేసే పనిలో ఉండగా, వైరు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు.

February 10, 2025 / 06:57 AM IST

ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బీజేపీదే: బండి సంజయ్

NLG: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

February 10, 2025 / 06:44 AM IST

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు

E.G: జిల్లాలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు RIO NSVL నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. తొలి విడతాగా 58 కేంద్రాల్లో ఇవాల్టి నుంచి ఈనెల 14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

February 10, 2025 / 06:39 AM IST

విశాఖలో పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్ష

VSP: జిల్లాలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.

February 10, 2025 / 06:17 AM IST

‘సముద్రతీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి’

AKP: రాంబిల్లి మండలం లోవపాలెం సముద్ర తీరా ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎరిపిల్లి అజయ్, మాజీ సర్పంచ్ చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్‌ను ఆదివారం కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రతీరంలో పరశురాముడు ఆలయం ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు.

February 10, 2025 / 06:15 AM IST

‘పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, కేజ్రీవాల్ నిరాకరించారు’

ఢిల్లీలో AAPతో ఎన్నికలకు ముందు పొత్తుకు CONG సిద్ధంగా ఉందని జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా పేర్కొన్నారు. కానీ ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అందుకు నిరాకరించారని తెలిపారు. ‘ఇది కేజ్రీవాల్ ఓటమి, CONG లేకుండా అద్భుతాలు చేయగలడనే ఆయన అహంకారం మాత్రమే’ అని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలుచుకోగా, CONG ఒక్క సీటు కూడా గెలవలేదు.

February 10, 2025 / 05:21 AM IST

వాలీబాల్‌లో విశాఖ యువకుల సత్తా

VSP: ఉత్తరాఖండ్ జాతీయ బీచ్ వాలీబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించి సాయి, బాబీ ఆదివారం విశాఖ చేరుకున్నారు. వారిని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. జాతీయ క్రీడ పోటీలలో బంగారు పతకం సాధించి విశాఖకు మంచి పేరు తెచ్చుకున్నారని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్నారు.

February 9, 2025 / 08:22 PM IST

కొండపి ఏవో ముఖ్యమైన సూచనలు

ప్రకాశం: కొండపి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఏవో డి.విజయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ తీసుకెళ్లి 14 అంకెల ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు సంఖ్య కార్డు పొందాలన్నారు.

February 9, 2025 / 08:21 PM IST

మొగల్తూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

W.G: మొగల్తూరు మండలంలోని కుక్కలవారితోట గ్రామంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అలాగే కూటమి అభ్యర్దిని గెలిపించాలని కోరారు.

February 9, 2025 / 08:16 PM IST

సెంచరీతో విధ్వంసం చేసిన హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కేవలం 77 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ సెంచరీ. అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ(51), సచిన్(49) ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

February 9, 2025 / 08:16 PM IST