ELR: నూజివీడు మండలం హనుమంతుని గూడెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాష మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో ఈ నెల 16 నుండి 25 వరకు రైతన్న మీకోసం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మండలంలో 9088 కుటుంబాలలో 5514 కుటుంబాలకు సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో చెన్నారావు పాల్గొన్నారు.