• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘4 లేబర్ కోడ్స్ రద్దుపై తీర్మానం చేయాలి’

MNCL: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం, 4 లేబర్ కోడ్స్ రద్దుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని TNTUC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లిలో ప్రధాన కార్యదర్శి మనీరామ్ సింగ్ మాట్లాడుతూ.. సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో గుర్తింపు సంఘాలు విఫలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.

March 18, 2026 / 06:19 PM IST

ప్రజా సమస్యల పరిష్కరమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

KDP: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. 15వ డివిజన్ నిరంజన్ నగర్‌లో నిర్వహించిన “అక్షరం అండగా – పరిష్కారమే అజెండాగా” కార్యక్రమంలో ప్రజలతో నేరుగా మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

March 18, 2026 / 06:19 PM IST

మామిడి రైతులకు ఉద్యాన శాఖ భరోసా

VZM: జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలుస్తూ పంట దిగుబడి పెంపుకు ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోందని జిల్లా ఉద్యాన అధికారి కె. చిట్టిబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటపై పురుగులు, తెగుళ్లు పెరిగిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

March 18, 2026 / 06:18 PM IST

లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి

JGL: మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ నుంచి నర్సపురం, హనుమాన్ గొర్రెపల్లి, వాల్గొండ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ నర్సింగ రావుకి 3 గ్రామాల సర్పంచ్లు వినతిపత్రం అందజేశారు. నర్సింగరావు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట సర్పంచ్ వెంకటేశ్, గొర్రెపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

March 18, 2026 / 06:18 PM IST

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లు ఉండరాదు: కలెక్టర్

KRNL: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల మ్యాపింగ్ లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీపీవో భాస్కర్‌ను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను వార్డుల వారీగా సరిగ్గా మ్యాప్ చేశారా లేదా అని పరిశీలించారు.

March 18, 2026 / 06:18 PM IST

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసిన మాజీ మంత్రి

ప్రకాశం: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బుధవారం హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

March 18, 2026 / 06:18 PM IST

కోడుమూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎమ్యెల్యే బొగ్గుల దస్తగిరి రూ. 8,17,992ల విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనారోగ్యాలతో హాస్పిటల్లో వైద్యం చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొన్న వారికి చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 18, 2026 / 06:18 PM IST

జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి

కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇవాళ జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులకు మేలు కలగాలని ఆకాంక్షించారు. సామరస్యానికి ప్రతీకైన రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

March 18, 2026 / 06:17 PM IST

డివిజన్లో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, రవీంద్ర నగర్‌లో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు ఇవాళ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డివిజన్ అభివృద్ధికి రూ. 3 కోట్ల 70 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 06:16 PM IST

‘అక్రమంగా మందుగుండు నిల్వ ఉంచడం నేరం’

VZM: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్రమంగా మందుగుండు సామాన్లు నిల్వ ఉంచడం చట్ట విరుద్ధమని ఒకటో పట్టణ సీఐ చౌదరి బుధవారం తెలిపారు. ఆ తరహా చర్యలు చేపట్టడం వలన ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పరిసర ప్రాంతాల్లో తయారు చేసినా, నిల్వ ఉంచిన పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాలు తెలిపిన పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

March 18, 2026 / 06:15 PM IST

BREAKING: 3 వేల పోస్టులతో డీఎస్సీ

AP: త్వరలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మరో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తం 3,004 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అందులో 1744 ఎస్జీటీ పోస్టులు కాగా, మిగితావి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

March 18, 2026 / 06:13 PM IST

భీమవరంలో జిల్లాకు చెందిన వ్యక్తి మృతి

VZM: జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భీమవరం రైల్వేస్టేషన్‌లో అపస్మారక స్థితిలో పడిపోయి చనిపోయినట్లు జీఆర్పీ పోలీసులు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మధ్యాహ్నం రైల్వేస్టేషన్‌లో ఆకస్మాత్తుగా పడిపోయాడని చెప్పారు. అతను ఆచూకీ తెలిసిన వారు మొబైల్ నెంబర్ 9705649492, లేదా 9440170317ని సంప్రదించాలని కోరారు.

March 18, 2026 / 06:13 PM IST

ముగిసిన పరీక్షలు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు తమ స్వగ్రామాల బాట పట్టారు. గూడవల్లి, నిడమానూరు, కానూరు, పెనమలూరు, గంగూరు తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు సామాన్లు సర్దుకుని ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి.

March 18, 2026 / 06:12 PM IST

జిమ్ మధ్యలో మానేస్తున్నారా..?

చాలా మంది మొదట్లో ఉత్సాహంగా జిమ్‌కు వెళ్తారు. కానీ మధ్యలోనే ఆపేస్తారు. అయితే, అకస్మాత్తుగా జిమ్ మానేయడం వల్ల కండరాల బలం క్రమంగా తగ్గిపోతుంది, ఓపిక కూడా క్షీణించవచ్చు. అదనంగా, జీవక్రియ మందగించి, బరువు పెరగడానికి దారితీస్తుంది. మీ శరీరంలో మీరు ఒకప్పుడు అనుభూతి చెందిన శక్తి, చురుకుదనం కూడా తగ్గిపోతుంది. అందుకే జిమ్ మానేసినా.. ఇంట్లోనైనా కొంచెం వ్యాయామం చేయాలి.

March 18, 2026 / 06:12 PM IST

‘అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు’

SKLM: జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, పెండింగ్‌‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

March 18, 2026 / 06:11 PM IST