ASF: పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం సూచించారు. పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు.
SDPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ఆకునూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.
విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం జరిగిన AISF రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ విజయవంతమైంది. 11 యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని సమస్యలపై చర్చించారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, నిధులు, స్కాలర్షిప్స్ విడుదలపై డిమాండ్ చేశారు. నూతన కమిటీలో కన్వీనర్‌గా ఉల్లం నాగరాజు ఎన్నిక కాగా, కో-కన్వీనర్లుగా అంజలి, ఉమామహేష్, వెంకటేష్ ఎంపికయ్యారు.
TG: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగింపుపై ఉత్కంఠకు తెరపడింది. ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది.
ASR: వ్యవసాయానికి అనుబంధంగా నాటు కోళ్ల పెంపకం చేపడితే గిరిజన కుటుంబాలు తక్కువ పెట్టుబడితోనే అధిక ఆదాయం పొందవచ్చని పశుసంవర్ధక శాఖ మండల పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కే రాజశ్రీ తెలిపారు. బుధవారం డుంబ్రిగుడ మండలంలోని వెలుగు కార్యాలయంలో సుమారు 150 మందికి పైగా BYP (Backyard Poultry) లబ్ధిదారులకు నాటు కోళ్ల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగియడంతో ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సువర్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టపర్తి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు.
BDK: ప్రాధాన్యతా రంగాల రుణాల లక్ష్యాలు, సాధనపై కలెక్టర్ అంకిత్ బుధవారం సమగ్ర సమీక్ష జరిపారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 31-12-2025 నాటికి జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగంలో 4945.28 కోట్ల లక్ష్యానికి గాను 4010.50 కోట్లు మంజూరు చేయబడిందని అన్నారు.
WNP: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూలులో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో ఐదు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిదారుల జాబితాను సిద్ధం చేసి వారికి నోటీసులు పంపించాలన్నారు.
అన్నమయ్య: జిల్లా మదనపల్లిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఇక్కడే జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
PLD: గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. జంట హత్య కేసులో ఆయన 6వ నిందితుడుగా ఉన్నాడు. 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
VZM: రోడ్డు ప్రమాదంలో మరణించిన గజపతినగరం కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది కలిసి రూ.4.30 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. సహోద్యోగి కుటుంబానికి అండగా నిలవడం ఐక్యతకు నిదర్శనమన్నారు.
VSP: అర్హులైన పేదలకు అర్బన్‌లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు మురుపల్లి పైడిరాజు అన్నారు. బుధవారం మధురవాడలో ఆయన మాట్లాడారు. ఈనెల 24 నుంచి సచివాలయాల వద్ద ధర్నాలు చేపడతామని తెలిపారు. ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెన్షన్ల కోతలు ఆపాలని కోరారు.
GNTR: కాకుమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను తహసీల్దార్ బి. వేంకటస్వామి బుధవారం పరిశీలించారు. విద్యార్దులకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు,హెల్త్ క్యాంపు ఏర్పాట్లను సందర్శించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
AP: విజయవాడ SS కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఆధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముస్లింలందరూ జగన్ వెంటే ఉన్నారని.. 2029లో జగన్‌ను సీఎం చేస్తామని మాజీ మంత్రి అంజద్ భాషా అన్నారు. కాగా, ఇందులో ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు.
TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధించింది. భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. నష్టపోయిన బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని భూదాన్ భూముల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేవలం 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని ఆదేశించింది.