• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యువకులకు క్రికెట్ కిట్ అందించిన సర్పంచ్

SRD: కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకులకు సర్పంచ్ సౌజన్య మణిక్ రెడ్డి క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సుధీర్, ఉప సర్పంచ్ గోవిందరావు పాటిల్, నాగభూషణం, మోహన్, గంగారం, అఖిల్, గంగాధర్ ఉమాకాంత్ ఉన్నారు.

March 18, 2026 / 05:00 PM IST

‘జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు’

BHPL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా BHPL జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ కోరారు.

March 18, 2026 / 05:00 PM IST

MPPSలో ఘనంగా ఉగాది వేడుకలు

E.G: ఉగాది పండుగ తెలుగు వారి సాంప్రదాయం అని MPPS విద్యా సంస్థ కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు పేర్కొన్నారు. మండపేట పబ్లిక్ స్కూల్‌లో బుధవారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పండుగలు సాంప్రదాయ బద్దంగా ఎంపీఎస్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. 

March 18, 2026 / 05:00 PM IST

‘కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో రేపు ఉగాది వేడుకలు’

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో గురువారం ఉదయం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వేద పండితుల ప్రార్థనలు, పంచాంగ శ్రవణం, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలను భక్తిశ్రద్ధలతో జరపాలని సూచించారు.

March 18, 2026 / 05:00 PM IST

నల్లమాడ సర్కిల్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

సత్యసాయి: పుట్టపర్తి సబ్‌డివిజన్ పరిధిలోని నల్లమాడ, ఆమడగూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అణిచివేయాలని, మహిళా భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

March 18, 2026 / 05:00 PM IST

దివ్యాంగులతో సహపంక్తి భోజనం చేసిన అధికారులు

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన “దివ్యాంగ శక్తి” కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి, ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆర్‌ఎం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని, వారికి అందిస్తున్న సేవలపై చర్చించారు.

March 18, 2026 / 05:00 PM IST

‘SFI విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం’

MBNR: SFI విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించిందని ఉపకులపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వర్సిటీలోని అకాడమిక్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే వెంటనే పోరాటం చేశారని గుర్తు చేశారు. విద్యార్థికి అన్యాయం జరగకూడదు అనే నిబంధనతో విద్యార్థి సంఘం పనిచేస్తున్నారన్నారు.

March 18, 2026 / 05:00 PM IST

విశాఖను దోచుకుతింటున్నారు: బొత్స

AP: విశాఖను దోచుకుతింటున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని.. కూటమి అవినీతిని ప్రజలకు తెలియాజేయాలన్నారు. పార్టీ కోసం నిలబడినవారికి GVMC ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. GVMC ఎన్నికలకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

March 18, 2026 / 04:58 PM IST

‘నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’

ELR: ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లలో పంచాయితీ అభివృద్ధి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీపీవో కొడాలి అనురాధ హెచ్చరించారు. బుధవారం ఉంగుటూరు పంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహిచంచారు. నూరు శాతం ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఉన్నారు.

March 18, 2026 / 04:55 PM IST

రాబోయే రోజుల్లో పెరుగునున్న ఉష్ణోగ్రతలు

ASF: కాగజ్ నగర్ మండలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి వాతావరణం చల్లబడింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం ఇక్కడ గరిష్టంగా 35.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇటీవల కురిసిన స్వల్ప వర్షాల ప్రభావంతో ఎండ తీవ్రత తగ్గిందని , రాబోయే రోజుల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

March 18, 2026 / 04:54 PM IST

వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో

KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై యధాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించగా బుధవారం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

March 18, 2026 / 04:54 PM IST

యూట్యూబర్ వైష్ణవి హత్యపై తాజా అప్‌డేట్

JGL: కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన భర్తను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మిట్‌లో మెట్‌పల్లి డీఎస్పీ రాములు మాట్లాడుతూ.. మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కుమార్తె చిత్తారి, గంధం వైష్ణవి (20)ను ఆమె భర్త చిత్తారి హరిబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

March 18, 2026 / 04:52 PM IST

GOOD NEWS: రైతుల ఖాతాల్లోకి ఒకేసారి నిధులు

TG: ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈనెల 22న రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒకేసారి రైతుభరోసా నిధులు జమ అవుతాయని తెలిపారు.

March 18, 2026 / 04:51 PM IST

పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్

BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవతరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలన్నారు

March 18, 2026 / 04:49 PM IST

పంట బోధి తవ్వకం పనులు ప్రారంభం

W.G: ఉండి మండల చెరుకువాడ గ్రామం 13 నెంబర్ పంట బోధి తవ్వకం పనులను ఉండి DC కమిటీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. మండల క్లస్టర్ ఇంచార్జ్ యర్రంకి బుజ్జి, గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబ శివరావు పాల్గొన్నారు.

March 18, 2026 / 04:49 PM IST