AKP: పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి కోలాటం పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలో జరిగే రామచంద్రమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే కోలాట బృందాలు తమ పేర్లను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలన్నారు.
జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశాడు. ఈ లేఖలో ఆప్ ఓటమిపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించాడు. కేజ్రీవాల్‌ను ట్రోల్ చేస్తూ.. ‘ప్రధాని కావాలనే మీ పగటి కలలన్నీ ఆపండి. మీ పార్టీ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పార్టీగా మారింది. మీరు, మీ సహచరులు.. మీ బ్యాగులు సర్దుకుని శాశ్వతంగా పదవీ విరమణ చేయండి’ అని లేఖలో పేర్కొన్నాడు.
KMR: ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్‌లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను సీఐ చంద్రశేఖర్ వివరించారు.
VZM: పట్టణంలోని తోటపాలెం, వైఎస్ఆర్ కాలనీ నుండి ప్రదీప్ నగర్‌లో SBI బ్రాంచ్ వరకు 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పలువురు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను సులువుగా గుర్తించవచ్చన్నారు. అలాగే పట్టణంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో రోడ్డు మార్జిన్, డ్రైన్లు, ఫుట్ పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జస్వంత్ రావు హెచ్చరించారు. సోమవారం వినుకొండ రోడ్డులోని ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేకుంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తామని హెచ్చరించారు.
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పంపిణీ చేశారు. సోమవారం ఒంగోలులోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో 13 మందికి 17 లక్షల 56 వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని చెక్కుల రూపంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు.
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల వచ్చిన దరఖాస్తులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ADB: పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామల దేవి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా 77 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు.
HYD: తాడ్బండ్‌లోని నాడ్ బన్ షావలి దర్గాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇటీవల స్థానిక ముస్లిం గ్రేవ్ యార్డ్ ప్రాంతంలో వీధి దీపాల ఏర్పాటు కోసం తన వంతుగా ఆర్థిక సహకారం అందజేశారు. వీధి దీపాల ఏర్పాటు పూర్తవ్వడంతో సోమవారం వీధిదీపాలను ప్రారంభించారు.
VZM: కొత్తవలస ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి.ఎస్.రాజశేఖర్ నాయుడు ఆదేశాలతో ఎల్.కోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో ఎస్సై ఎన్.రమ్యశ్రీ నేతృత్వంలో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాయుడు అనే వ్యక్తి వద్ద పది అక్రమ మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
NLR: జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు.
NZB: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.
MNCL: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేశారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి శేఖర్ రావు సోమవారం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. శేఖర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి నామినేషన్ వేశానన్నారు.
NRML: పన్ను వసూలు త్వరిత గతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలలో ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన వసూలు వివరాలను మునిసిపాలిటీల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
KMR: ఎల్లారెడ్డి తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలకు దళితులకు రానివ్వలేదని సామాజిక జిక మధ్యమాల్లో వైరల్ కావడంతో ఆగ్రామాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ.. కుల వివక్షత చూపవద్దని అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు.