SS: మడకశిర పట్టణం RMB విశ్రాంతి భవనంలో మడకశిర విద్యుత్ శాఖ నూతన ఏడీ రఘు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, నాయకులు పాల్గొన్నారు.
MLG: జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఆలెం స్వామి, భార్య అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగరాజన్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు వరంగల్ పశ్చిమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బీసీ కుల గణన నివేదిక, 420 హామీల అమలు తీరుపై విస్తృతస్థాయిలో చర్చ చేయనున్నట్లు పేర్కొన్నారు.
WGL: చెన్నారావుపేట మండలం తిమ్మారాయనిపహాడ్లోని మొక్కజొన్న చేనులో మంగళవారం సందీప్ అనే యువరైతు పొలానికి వెళ్లగా అక్కడ కొండచిలువ కనిపించింది. భయానికి గురైన రైతు.. గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామానికి చెందిన యువకుల సహకారంతో ప్రాణంతో ఉన్న కొండచిలువను పట్టుకొని గ్రామపంచాయతీ ఆవరణలో తీసుకువచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
KRNL: దేవనకొండ మండలంలోని హంద్రీనీవా పంట కాలువల్లో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాలువలో నీరు ముందుకు కదలకపోవడంతో తమ పంట పొలాలకు సక్రమంగా అందడంలేదని దిగువున సాగుచేస్తున్న రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించి సాగునీరు సక్రమంగా అందేటట్లు కృషి చేయాలని కోరుతున్నారు.
KNR: కరీంనగర్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ పరిధిలో వార్డు అధికారుల ద్వారానే పన్నుల వసూలు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీ, 6 గ్రామాల్లో వార్డు అధికారులే ప్రత్యేక యంత్రాల ద్వారా ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, నల్ల బిల్లులు వసూలు చేస్తారని తెలిపారు.
KRNL: జిల్లా సి. బెళగల్ మండలం పోలకల్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఇసుక టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పోలకల్‌కు చెందిన సోమప్పగా గుర్తించారు. సోమేశ్వరస్వామి ఆలయంలో పూజ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: గోనెగండ్ల మండలం బైలుప్పుల, అగ్రహారం, గంజహళ్లిలలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పసెద్ధుల మహదేవ్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
AP: వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం చెప్పగా.. 2047@ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఏం చేయాలో మనం చెప్పామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఫైల్స్ క్లియరెన్స్‌లో వేగం పెంచాలి. కేంద్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల వాణిజ్య పంటలకు ప్రోత్సాహం లభిస్తోంది. 93% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించాం’ అని తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జబల్పుర్ జిల్లా సిహోర పట్టణం వద్ద ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
NLR: కందుకూరు పట్టణంలోని శతాబ్దాల నాటి ప్రాచీన ప్రసిద్ధి అంకమ్మ తల్లి దేవాలయంలో ఈనెల 12వ తేదీ ఏకాహం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు (ఏకాహం) లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏకాహంలో పాల్గొంటారని తెలిపారు.
KMRD: పట్టణంలోని UPHCలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యాధికారి డా. చందన ప్రియ తెలిపారు. గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. రక్తహీనత లేకుండా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్, తదిరులు ఉన్నారు.
HYD: మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
NRML: మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్టించి పట్టణంలోని పురవీధుల గుండా శోభయాత్ర కొనసాగించారు.