NDL: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున నుండే పోటెత్తారు. బనగానపల్లె పట్టణంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఉత్తరం ద్వారా వెళ్లి భక్తులు దర్శించుకుంటున్నారు. ఏకాదశి రోజున ఉత్తరం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.
WGL: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ASF: దహేగాం మండలంలోని లగ్గామ గ్రామంలో గురువారం ఎస్సై రాజు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనం నడిపేవారు లైసెన్స్‌తో సహా అన్ని ధ్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
TPT: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈనెల 17వ తేదీన సంకట హర గణపతి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొన్నాలని ఆయన కోరారు.
TPT: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం సంచాలకులు అరుణ తెలిపారు. ఎంఏ సంగీతం, తెలుగు, ఎంకాం, డిప్లొమో ఇన్ మ్యూజిక్ (సంకీర్తన, వర్ణం, అన్నమయ్య అంతరంగం) కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0877 2284524ను సంప్రదించాలన్నారు.
CTR: వడమాలపేట మండలానికి చెందిన టీడీపీ పార్లమెంటు అధికార ప్రతినిధి ఎల్లా లక్ష్మీ ప్రసన్న గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కాసేపు ఆయనతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వడమాలపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
CTR: గురువారం నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు సచివాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.విశ్వనాథ్ తనిఖీ చేశారు. వార్డు పరిధిలో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
కోనసీమ: తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని, కార్యకర్తలే పార్టీ పునాదులని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం రూరల్ మండల నాయకులు, కార్యకర్తల సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు.
కోనసీమ: కె.గంగవరం మండలంలోని దంగేరు గ్రామ అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గురువారం దంగేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ‘మన గ్రామం- మన సుభాష్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజవర్గంలో మూడు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.
KKD: సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు గురువారం కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఎస్సై, తాహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వీఆర్వోలతో బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని ఆదేశించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
AP: ప్రధాని మోదీ రోడ్ షో ఘనంగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ బహిరంగ సభలో మాట్లాడిన బాబు.. రాష్ట్రాభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉండే పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ రాకతో రూ.2.08లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నక్కపల్లి, కృష్ణపట్నంలో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. విశాఖ చిరకాల వాంఛ రైల్వే జోన్‌ను ప్రారంభించుకున్నామన్నారు.
GDL: ట్రాక్టర్ ట్రాలీ కింద పడి చిన్నారి మృతి చెందిన ఘటన గట్టు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేష్ వివరాల ప్రకారం..మండలంలోని తుమ్మలపల్లి చెందిన బోయ సంధ్య, హుస్సేన్ కూతురు రిషిక (4) ఇంటి ముందు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా అతివేగంగా ట్రాక్టర్ వచ్చి ఎడమ వైపు టైర్ కింద పడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేడు కేసు నమోదు చేశామన్నారు.
MBNR: కురుమ యాదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కురుమ యాదవులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని వెల్లడించారు.
AP: ఎన్డీయే ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బలమైన భారత్ కోసం మోదీ కృషి చేస్తున్నారని.. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ అని కొనియాడారు. అభివృద్ధి అంటే ఆంధ్ర అని కొనియాడారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకంతో 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. మోదీ రాకతో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు.
VZM: ఎస్.కోట అర్బన్ పోలీసు స్టేషన్ పరిధిలో సన్యాసమ్మ గుడి వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మలుపు వద్ద తుప్పలు ఏపుగా పెరగడంతో వాహనదారులకు అటువైపు వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదాలు తరచుగా జరిగేవి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనడంతో అర్బన్ సీఐ వి.నారాయణ మూర్తి ప్రత్యేక చొరవతో సిబ్బంది పర్యవేక్షణలో జెసిబితో తుప్పలను తొలగించారు.