• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు

CTR: ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ ఆదేశించారు.

January 8, 2025 / 06:12 AM IST

నేడు సుదర్శన్ హోమం

MDK: ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా అల్లాదుర్గం వెంకటేశ్వరాలయంలో బుధవారం సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు, పురోహితులు శిలాంకోట ప్రవీణ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, అభిషేకం, లక్ష్మీ నారాయణహోమం, వాస్తు, నవగ్రహ పూజలు ఉంటాయన్నారు. భక్తులు గమనించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

January 8, 2025 / 06:02 AM IST

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు

MDK: నర్సాపూర్ మండలం జక్కపల్లి సమీపంలో గల అదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఫర్హానా ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతితో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

January 8, 2025 / 05:57 AM IST

ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

JGL: ఉచిత కుట్టు మిషన్లకై క్రిస్టియన్ మైనారిటీ మహిళల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆర్ఎస్. చిత్రు తెలిపారు. కనీసం 5వ తరగతి చదివి ఆధార్ కార్డు కలిగి ఉండి వయసు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య గలవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 20 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

January 8, 2025 / 04:21 AM IST

ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్

JGL: బీర్పూర్ మండలం చిన్న కొల్వాయిలో ఉన్న ఇసుక రిచ్‌ను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. అనంతరం వారి ఆదేశాల మేరకు ఇసుక డంపులను అధికారులు 118 ట్రాక్టర్ ట్రిప్పులను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా పక్కాగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఆదేశించారు. వారి వెంట జిల్లా మైనింగ్ అధికారి జై సింగ్ ఉన్నారు.

January 8, 2025 / 04:20 AM IST

కిరాణా షాపుల్లో పోలీసుల తనిఖీలు

KNR: హుజురాబాద్ పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. సీఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో చాలా మంది గాలిపటాలను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుండడంతో ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. చైనా మాంజా ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయన్నారు. దీనిని ఎవరు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

January 8, 2025 / 04:18 AM IST

రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి: జేసీ

ATP: రెవెన్యూ సదస్సులలో సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకుని, అభివృద్ధి బాటలో నడవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మండలం ధర్మాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. రైతులందరూ పరస్పర సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

January 8, 2025 / 04:09 AM IST

కోడిపందాల నిషేధ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

ELR: కోడిపందాలు నిర్వహించడం నేరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం కోడిపందాల నిషేధ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సమయంలో జిల్లాలో చట్టవిరుద్ధమైన కోడిపందాలను నిషేధించడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

January 8, 2025 / 04:05 AM IST

నేటి నుంచి ముక్కోటి ఉత్సవాలు

ELR: ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి క్షేత్రంలో బుధవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఉంగుటూరులో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 10:15 గంటలకు కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

January 8, 2025 / 04:03 AM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా సమాఖ్య సభ్యులు

ELR: నూతనంగా ఎన్నికైన జిల్లా సమాఖ్య, జిల్లా పాలకవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు e-commerce (ONDC) ద్వారా మార్కెటింగ్ జరిగేలా చూడాలని, ఉల్లాస్ కార్యక్రమంలో పాల్గొని వయోజన విద్య కోసం మరింత కృషి చేయాలన్నారు.

January 8, 2025 / 04:01 AM IST

‘స్వర్ణ కుప్పం విజన్ 2029’ డాక్యుమెంట్ విడుదల

AP: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు, అలాగే ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’ డాక్యుమెంట్ విడుదల చేశారు.

January 6, 2025 / 12:47 PM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

NTR: గీత కార్మికుడు మృతి చెందిన జగ్గయ్యపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని షేక్ మొహమ్మద్ పేటలో తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గీత కార్మికుడు చలమయ్య మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

January 6, 2025 / 12:42 PM IST

6వ రోజు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు

KKD: జిల్లా పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్‌లో 6వ రోజు పోలీస్ కానిస్టేబుల్ పురుష అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నియమ, నిబంధనల ప్రకారం సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.

January 6, 2025 / 12:40 PM IST

స్టార్‌లింక్‌ తీరు పట్ల కేంద్రం అసంతృప్తి!

ఇటీవల మణిపూర్, అండమాన్ నికోబార్ పోలీసుల సోదాల్లో స్టార్ లింక్ డివైజ్ లు బయటపడ్డాయి. నేరస్తులు వాటిని వినియోగించుకొని అక్రమంగా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నట్లుగా అభియోగాలు వస్తున్నాయి. డివైజ్‌ కొనుగోలుదారుల వివరాలు చెప్పాలని అధికారులు స్టార్ లింక్ ను కోరగా.. అది వినియోగదారుల గోప్యతకు ముప్పు అని వెల్లడించింది.

January 6, 2025 / 12:05 PM IST

ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్‌

NZB: ఫిబ్రవరి 7న వెయ్యి డప్పులు లక్ష గొంతుకలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం బాల్కొండలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే SC వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు.

January 6, 2025 / 11:55 AM IST