GDL: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జనరల్ వార్డ్, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలు తనిఖీ చేశారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
AP: జగన్ పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని.. మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. గతంలో వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈరోజు కూటమి ప్రభుత్వం మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించబోమని మోదీతో ప్రకటన చేయించాలని సవాల్ చేశారు.
AP: 2047 నాటికి దేశాన్ని అగ్రగామిగా చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని తెలిపారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం. హర్ ఘర్ తిరంగా.. ఎక్కడ చూసినా నమో నినాదాలే. పేదల చిరునవ్వు నమో.. మహిళ ఆశాదీపం నమో’ అని పేర్కొన్నారు.
PPM: జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అధికారులు సమన్వయంతో సమష్టి కృషి చేయాలని అరకు ఎంపీ తనూజారాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె బుధవారం స్థానిక కలక్టరేట్‌లో జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటి సమావేశం నిర్వహించారు.
WNP: స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లింకులను ఓపెన్ చేయవద్దని ఎస్సై యుగంధర్ రెడ్డి సూచించారు. బుధవారం వెల్టూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. శ్రద్ధతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్సై వారికి సూచించారు.
MBNR: రాష్ట్రంలోనే నెంబర్ 1గా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో MBNR ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు.
మహబూబ్ నగర్: ఈనెల 11న కొత్తకోట సమీపంలోని కురుమూర్తి జాతరలో జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులందరూ విజయవంతం చేయాలని పూజారి శివానంద స్వామి బుధవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి ‘గిరి ప్రదర్శన’ కార్యక్రమాల్లో భక్తులందరూ వేలాదిగా పాల్గొని కురుమూర్తిస్వామి కృప పొందాలని కోరారు.
WNP: పట్టణానికి చెందిన BRS నేత, ఉద్యమకారుడు శివనారాయణ నిన్నరాత్రి అడ్డాకులలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం క్రిష్టగిరిలోని ఆయన నివాసానికి చేరుకొని శివనారాయణ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను నిరంజన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
NDL: ఆత్మకూరు పట్టణ శివార్లలోని దోర్నాల రస్తాలో నిర్వహిస్తున్న ఉమూమి తబ్లిగీ ఇస్తేమాను బుధవారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సందర్శించారు. అక్కడి ఏర్పాట్ల గురించి ఇస్తేమా కమిటీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంత భారీ ఎత్తున ఇస్తేమా జరగడం సంతోషకరమన్నారు.
NDL: ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో నుంచి ఉదయం 11:45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని హెలికాఫ్టర్ ద్వారా పాణ్యం మండలం పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పంపింగ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు పరిశీలించి అనంతరం పవర్ హౌస్‌ను సందర్శించానున్నట్లు సమాచారం.
ATP: రాయదుర్గంలోని కె టి ఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ ద్వితీయ ఏడాది చదువుతున్న యోగేశ్వరి,గోపాల్ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారిలో నిలిచారు. ఇటీవల 15 రోజులపాటు ఉత్తర కాశీలోని హిమాలయ పర్వతారోహణకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 17 ఎన్సిసి కమాండెంట్లకు చెందిన క్యాడేట్లు హాజరుకాగా ఏపీ తరఫున యోగేశ్వరి గోపాల్ ఇద్దరే ఉండడం గమనార్హం.
TG: భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శ్రీకృష్టుడి అవతారంలో సీతారామచంద్ర స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం గోదావరి నదీ తీరాన హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 10న ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు.
W.G: జిల్లాలోని వివిధ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. జీలుగుమిల్లి- బుట్టాయిగూడెం, ఎల్‌ఎన్‌డీ పేట – పట్టిసీమ రహదారి విస్తరణ (రూ.369 కోట్లు), గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వేలైన్, భీమవరం- నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు (రూ.4612 కోట్లు) ప్రారంభిస్తారు.
BNR: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కొలనుపాక, కుండ్లగూడెం, టంగుటూరు, శారాజీపేటలలో సీసీ రోడ్లు, ఆలేరులో మహిళా శక్తి భవనం నిర్మాణం, కొలనుపాకలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు పర్యటిస్తారని పేర్కొన్నాయి.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో పలుచోట్ల బుధవారం వేకువ నుండే ఎండీయూ ఆపరేటర్లు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. చలికి వణుకుతూ వృద్ధులు, మహిళలు క్యూలో నిలబడి రేషన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం చలికాలంలో వృద్ధులు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం వేకువజాము నుండే లాగిన్ అయ్యి రేషన్ ఇవ్వాలని ఎండీయూ ఆపరేటర్లను ఆదేశించారు.