MDK: చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ‘మై భారత్’ కార్యక్రమానికి ఎంపికైంది. ఈ సందర్భంగా యువజన సంఘాలను ప్రోత్సహించే లక్ష్యంతో మై భారత్ ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సంఘం సభ్యులకు స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో యువత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు లింగం గౌడ్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.