• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిది’

AP: అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ 25 ఏళ్లల్లో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలు అందించి అరుదైన ఘనత సాధించింది. పిల్లల ఆకలి తీర్చి పాఠశాలల్లో హాజరు పెంచేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిది’ అంటూ కొనియాడారు.

March 18, 2026 / 09:15 AM IST

జిల్లాలో పొగాకు కొనుగోలు ప్రారంభం

W.G: ఉమ్మడి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోలు ఈనెల 25 నుంచి ప్రారంభంకానుంది. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1, 2, గోపాలపురం, దేవరపల్లిలో వేలం కేంద్రాలు ఉన్నాయి. రెండేళ్లుగా వర్జీనియా పొగాకు ధరలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఇప్పుడు రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేశారు. 2024-25 సీజన్లో కేజీ అత్యధికంగా రూ.456 పలికింది.

March 18, 2026 / 09:13 AM IST

‘పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి’

PLD: పశుసంవర్ధక శాఖ సిబ్బంది పశువులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు తెలిపారు. శావల్యాపురం మండలం కొత్తలూరులో పశుసంవర్ధకశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను మంగళవారం ఆయన పరిశీలించారు. వెటర్నరీ డాక్టర్లు గణేశ్, కావ్యలతో కలిసి గాలికుంటు టీకాల గోడపత్రికలు ఆవిష్కరించారు. అనంతరం పశువులకు టీకాలు వేశారు.

March 18, 2026 / 09:10 AM IST

టైర్లలో గాలి తక్కువైతే ఏమవుతుందంటే?

టైర్లలో గాలి తక్కువైతే.. రోడ్లకు, టైర్లకు మధ్య స్పర్శ విస్తీర్ణం పెరుగుతుంది. ఫలితంగా వాటి మధ్య రాపిడి ఎక్కువై, ఇంధన వినియోగం కూడా అధికమవుతుంది. అలాగని గాలిని మరీ ఎక్కువగా నింపితే ఇంధన వాడకం తగ్గినా.. గ్రిప్పింగ్ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి వాహన ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఎప్పుడూ టైర్లలో పీడనం.. తయారీ సంస్థ సిఫార్సు చేసిన స్థాయిలో ఉండేలా చూసుకోండి.

March 18, 2026 / 09:08 AM IST

నాగార్జునసాగర్ నీటిమట్టం 535 అడుగులు

NLG: నాగార్జునసాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా ప్రస్తుతం 535.90 అడుగుల మేర నీరుంది. నీటి నిల్వ 179.89 టీఎంసీలుగా నమోదైంది. కుడి కాలువ ద్వారా 8,023 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8,541 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మెయిన్ పవర్ హౌస్ నుంచి 4,046 క్యూసెక్కులు విడుదలవుతుండగా, మొత్తం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 22,910 క్యూసెక్కులుగా ఉంది.

March 18, 2026 / 09:07 AM IST

స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ల ఆవిష్కరణ

GNTR: ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందించిన విజన్‌ను ప్రతిబింబించే ఈ క్యాలెండర్లను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాల పెంపు, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

March 18, 2026 / 09:05 AM IST

డొమెస్టిక్ గ్యాస్ వినియోగం..కేసు నమోదు

వనపర్తిలో ఆహా హోటల్‌పై మంగళవారం అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో డిప్యూటీ తహసీల్దార్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. హోటల్లో వినియోగిస్తున్న మూడు డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు.

March 18, 2026 / 09:05 AM IST

సూర్యాపేటలో గ్యాస్ కొరతతో హోటళ్లు క్లోజ్

SRPT: ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధ ప్రభావం సూర్యాపేట జిల్లాలోని హోటళ్లప్తె పడింది. గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్ బండ్లు మూతపడుతున్నాయి. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం జిల్లాకు వచ్చేవారు ఇక్కడే టీ, టిఫిన్లు, భోజనం చేస్తుంటారు. సుమారు సూర్యాపేట పట్టణంలో 150కి పైగా టిఫిన్ సెంటర్లు ఉంటాయి..

March 18, 2026 / 09:05 AM IST

ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు : ఎస్పీ

ADB: జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకునేందుకు ప్రతిరోజు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరుగా FIR నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.

March 18, 2026 / 09:04 AM IST

నార్కోటిక్ డాగ్ లైకా.. 6 కేజీల గంజాయి పట్టివేత

విశాఖలో గంజాయి, నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా మంగళవారం ఆర్.టీ.సీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్డులో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దీనిలో భాగంగా కిరండోల్ ట్రైన్‌లో 6 కేజీల గంజాయిని నార్కోటిక్ డాగ్ లైకా సహాయంతో గుర్తించారు. గంజాయిని గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు.

March 18, 2026 / 09:04 AM IST

ఎల్‌పీజీ కొరతకు బయోగ్యాస్ పరిష్కారం.!

RR: నిత్యం పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు, కొరతను అధిగమించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దే బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఫైనాన్షియల్ క్రైమ్ కంప్లయన్స్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ ఇఫ్తేకర్ అలీ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని గ్రామస్తులు వ్యర్థాల ద్వారా ఇంధనాన్ని తయారు చేసుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

March 18, 2026 / 09:03 AM IST

ఇసుక రీచ్ వద్ద గొడవ.. 12 మంది అరెస్ట్

TPT: పెళ్లకూరు(M) కలవకూరు ఇసుక రీచ్ వద్ద ఈ నెల 14న జరిగిన ఘటనపై పోలీసులు 25 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకునే క్రమంలో సిబ్బందిపై దౌర్జన్యం చేసి, బిల్లింగ్ యంత్రం ధ్వంసం చేసి, మొబైల్ ఫోన్లు లాక్కున్నట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

March 18, 2026 / 09:03 AM IST

శ్రీకాళహస్తిలో గంజాయి.. ఒకరి అరెస్ట్

TPT: శ్రీకాళహస్తి పట్టణం కైలాసగిరి కాలనీ సమీపంలో గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేశామని టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. తమిళనాడుకు చెందిన పెరుమాళ్ వేణుగోపాల్‌ను అదుపులో తీసుకున్నారు. అతని వద్ద 2 కేజీల గంజాయి దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 18, 2026 / 09:01 AM IST

అగ్నిప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం

కోనసీమ: రాజోలు మండలం శివకోడు గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది, రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్ని మాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.

March 18, 2026 / 09:01 AM IST

ఇంట్లో మంటలు.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ముగ్గురిని రక్షించారు. రాత్రి ఆ కుటుంబం వాహనానికి ఛార్జింగ్ పెట్టింది. అయితే, ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం దగ్ధమైంది.

March 18, 2026 / 08:58 AM IST