RR: నిత్యం పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు, కొరతను అధిగమించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దే బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఫైనాన్షియల్ క్రైమ్ కంప్లయన్స్ ఎక్స్పర్ట్ సయ్యద్ ఇఫ్తేకర్ అలీ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని గ్రామస్తులు వ్యర్థాల ద్వారా ఇంధనాన్ని తయారు చేసుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.