PPM: జీయ్యమ్మవలస మండలంలోని ఎరకాలపేట, వెంకటాపురం గ్రామాల మధ్య అరటి తోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని తెలిపారు.