MBNR: నేరళ్లపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని తొలగించకుండానే సీసీ రోడ్డు నిర్మించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్లడానికి కూడా వీలు లేకుండా రోడ్డు మధ్యలోనే స్తంభం ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించాలని కోరుతున్నారు.