అసెంబ్లీలో మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పట్ల బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. పరివాహక ప్రాంత ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ప్రతిపక్ష ప్రశ్నలను దాటవేస్తోందని మండిపడుతూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సభను బహిష్కరించారు.