WGL: నగరంలోని 66 డివిజన్ పరిధిలో నాలాల మార్కింగ్ పూర్తిగా, పక్కాగా చేపట్టాలని కలెక్టర్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయి ఆదేశించారు. నాలాల విస్తరణకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటి అంచనాలు రూపొందించాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు. గతంలో నాలాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి, ఆక్రమణల తొలగింపుకు ప్రణాళిక సిద్ధం చేయలన్నారు.