మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ముగ్గురిని రక్షించారు. రాత్రి ఆ కుటుంబం వాహనానికి ఛార్జింగ్ పెట్టింది. అయితే, ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం దగ్ధమైంది.