సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్ శర్మ ఆడటం లేదు. విశాంత్రి పేరుతో రోహితే బెంచ్‌పై కూర్చున్నాడని బుమ్రా తెలిపాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌కి విశ్రాంతి అని చెబుతున్నా.. అది తప్పించడమేనని ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించాడు. ఇది సిరీస్ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ అని.. అందుకే, అతడిని తప్పించారని పేర్కొన్నాడు.
కృష్ణా: విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో తాగుబోతులు గురువారం అర్థరాత్రి వీరంగం సృష్టించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన 5బైకులను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. పోలీసులు రాత్రి సమయంలో తిరగడంలో నిర్లక్ష్యంగా ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని భవానీపురం వాసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
MBNR: కేజ్‌వీల్స్‌తో ట్ట్రాక్టర్లు రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవల్లి మండల ఎస్సై రాము హెచ్చరించారు. ప్రస్తుతం పొలాలు దున్నే సమయం కాబట్టి ట్రాక్టర్ యజమానులు కేజ్‌వీల్స్ బీటీ రోడ్లు, సీసీ రోడ్లపైకి రావటంతో దారులన్నీ పాడవుతాయన్నారు. ఈ విషయంలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు సహకరించాలని సూచించారు. లేదంటే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
MBNR: కొందుర్గు మండలంలో రేపు MRPS ఆధ్వర్యంలో మాదిగ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ కొందుర్గు మండల అధ్యక్షుడు ఆనంద్ తెలిపారు. జీఎం పటేల్ మినీఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి శివ హాజరుకానున్నట్లు తెలిపారు.
MBNR: ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధిత శాఖ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 441 గ్రామపంచాయతీలకు గాను 3,838 వార్డులను గుర్తించి గ్రామాలలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా: గుడివాడకు చెందిన CRPF జవాన్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో CRPF ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కర్రా శ్రీరామకృష్ణ క్యాంప్ కార్యాలయంలో గురువారం గుండెపోటుకు గురై మృతి చెందారు. శనివారం ఎన్.జి.ఓ కాలనీకి ఆయన భౌతిక కాయం చేరుకుంటుంది. వీరమరణం చెందిన శ్రీరామకృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
కృష్ణా: రోడ్డు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఘంటసాల మండలం తెలుగురావుపాలెంలో పాత పంచాయితీ కార్యాలయం నుంచి గుండేరు డ్రైనేజీ వైపు ఉన్న జిల్లా పరిషత్ డొంక మట్టి రోడ్డుగా ఉందని తెలిపారు. శ్రీకాకుళం, గాజుల్లంక, తెలుగురావుపాలెం గ్రామాల రైతులకు అవసరమైన ఈ రోడ్డు నిర్మించాలని కోరారు.
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మహిళా ఉపాద్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సంఘసంస్కర్త, దేశం యొక్క మహిళా విద్యకు మార్గదర్శకురాలు అని కొనియాడారు.
NRML: షార్ట్ సర్క్యూట్‌తో రెండు దుకాణాలలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన శుక్రవారం బాసర మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో స్థానిక బస్టాండ్ వద్దగల శారద ప్రియా మిల్క్‌లో సార్ట్ సర్క్యూట్ జరిగి భారీ ప్రమాదం సంభవించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్సై గణేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
NZB: సారంగాపూర్‌లో నివాసం ఉంటున్న దుబ్బాక సాయమ్మ (65) అను వృద్ధురాలిని గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోంతునులిమి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు. ఇటీవల భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా నివసిస్తుంది. ఆరో టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
WGL: ఎనుమాముల మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఈ రోజు తేజ మిర్చి గురువారం క్వింటాకు రూ. 15,000 ధర పలకగా..ఈ రోజు రూ.14 వేలకు పడిపోయింది.అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా ఈ రోజు రూ.13,500 ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు గురువారం రూ.16,400 ధర రాగా ఈరోజు రూ.15 వేలకు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.
NZB: నగరశివారులో ఓ మహిళదారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం సారంగాపూర్ వడ్డెర కాలనీలో వెలుగు చూసింది. కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మకు నలుగురు సంతానం. ముగ్గురికి వివాహం కాగా చిన్నకొడుకు దుబాయ్‌లో ఉంటున్నాడు. భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న 6వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BPL: జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని శుక్రవారం పరకాలలోని వారి నివాసంలో శాయంపేట బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు గంగుల మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
NZB: ఇందల్వాయి ఎస్సై మనోజ్ అవినీతికి పాల్పడుతున్నట్లు ఐజీకి శుక్రవారం ఫిర్యాదు అందింది. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎస్సై మనోజ్ సొంతంగా జేసీబీలను ఏర్పాటు చేసి లింగాపూర్, గౌరారం వాగులలో ఇసుక తవ్వించి.. జైపాల్ నాయక్, శ్రీను, రమేశ్ అనే వ్యక్తుల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఊర చెరువులో చనిపోయిన గోవులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విచ్చలవిడిగా పడేశారు. దీంతో దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల ప్రజలు వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరోసారి ఇలా జరగకుండా చూడాలని కోరారు. అలా వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.