IPL 2025లో భాగంగా సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్య కుమార్ (67), నమన్‌ధీర్ (46), తిలక్ వర్మ(25) పరుగులు చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం అప్‌డేట్ పంచుకుంది. రిలీజ్ డేట్‌తో కూడిన గ్లింప్స్‌ను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉదయం 11:45 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నెట్టింట మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.
SRD: ప్రజలకు సైబర్ మోసాలు బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సివిల్ తగాదాలు తల దూర్చవద్దని సూచించారు.
అన్నమయ్య: భారత కమ్యూనిస్టు పార్టీ అఖిలభారత 24వ మహాసభలు తమిళనాడులోని మధురైలో జరుగుతున్నాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ మహాసభలకు శుక్రవారం మదనపల్లె నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. సీపీఎం అధికారంలోకి వస్తేనే కష్టజీవుల బాధలు తీరుతాయన్నారు.
KDP: సీజనల్ వ్యాధులు నివారించేందుకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాధవరం వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మాధవరం-1 పంచాయతీలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కడప DMHO K.నాగరాజు తనిఖీ చేశారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని DMHO ప్రజలకు సూచించారు.
NGKL: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్లోని LIC ఆఫీస్ పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సినీ గాయకులు లాస్య ప్రియ, సంపత్, శిరీష తదితరులు సందడి చేశారు. శుక్రవారం కళాశాల వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇందులో భాగంగా ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ డీ.రమణారెడ్డి, ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.
SRD: చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ పరిధిలోని జేఎన్టీయూను ఉప కులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆర్డీవో పాండు చేతుల మీదుగా జయంతికి సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ నరసింహ, ఫార్మసీ ప్రిన్సిపల్ సునీత రెడ్డి పాల్గొన్నారు.
NLG: కట్టంగూర్ మండలం ఈదులూరు వాసి గద్దపాటి నరసింహను కుల సంఘానికి తన భూమి ఇవ్వలేదని 3 ఏళ్ల క్రితం కుల పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. నరసింహ ఇంటికి ఎవరూ వెళ్లొద్దని, అతడు కూడా ఎవరింటికీ రావద్దని తీర్మానించారు. అప్పటి నుంచి నరసింహ మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల ఓ కార్యానికి నరసింహ రాగా కులపెద్దలు వెళ్లిపోమ్మన్నారు. శుక్రవారం బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
SRD: ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలో యువ వికాసం సహాయ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
AP: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కాకాణికి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సోమవారం ప్రాసిక్యూషన్ వాదనల తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.
అన్నమయ్య: పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ ఎంతో ప్రసిద్ధి చెందిందని గ్రూప్ కెప్టెన్ ఆర్‌జే ఆత్రే కమాండింగ్ ఆఫీసర్ అన్నారు. శుక్రవారం అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్సీసీ వింగ్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉన్నత చదువులకు ఎన్సీసీ ధృవపత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
BHPL: ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని, పెద్ద ఎత్తున లేబర్ను తీసుకురావాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం పలు మండల ప్రత్యేక అధికారులతో ఐడీవోసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
NLG: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం నెలకొందని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న సమీక్షలు లేవు, కొనుగోలు కేంద్రాలపై మాట్లాడడం లేదన్నారు.
MBNR: జిల్లా కేంద్రానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం మంజూరు అయింది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇది ప్రారంభంకానుంది. ఇందులో నాణ్యమైన మందులు తక్కువ ధరలకు లభించనున్నాయి. దీంతో పేద ప్రజలకు మందుల ఖర్చులు తగ్గనున్నాయి.