TG: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYDతో పాటు పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.