SRD: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఆదిత్య (17) మియాపూర్లో నివసిస్తూ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మల్లంపేటలో బంధువుల ఇంటికి వచ్చి, స్నేహితులతో కలిసి కాజిపల్లి శివారులోని కంకర క్వారీలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.