AP: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని CM చంద్రబాబు ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. ఉదయం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఉగాది వేడుకలకు హాజరుకానున్నారు. ఆయన సమక్షంలో నిర్వహించనున్న పంచాంగ శ్రవణంం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా కళారత్న, ఉగాది పురస్కారాలను ఆయన ప్రదానం చేయనున్నారు.