KKD: జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో 6వ రోజు పోలీస్ కానిస్టేబుల్ పురుష అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమ, నిబంధనల ప్రకారం సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
ఇటీవల మణిపూర్, అండమాన్ నికోబార్ పోలీసుల సోదాల్లో స్టార్ లింక్ డివైజ్ లు బయటపడ్డాయి. నేరస్తులు వాటిని వినియోగించుకొని అక్రమంగా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నట్లుగా అభియోగాలు వస్తున్నాయి. డివైజ్ కొనుగోలుదారుల వివరాలు చెప్పాలని అధికారులు స్టార్ లింక్ ను కోరగా.. అది వినియోగదారుల గోప్యతకు ముప్పు అని వెల్లడించింది.
NZB: ఫిబ్రవరి 7న వెయ్యి డప్పులు లక్ష గొంతుకలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం బాల్కొండలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే SC వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు.
కృష్ణా: తమ ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు కానిస్టేబుల్ అభ్యర్థులను కోరారు. ఆరోగ్య సమస్యల కారణంగా కాల్ లెటర్లో తెలిపిన తేదీన దేహదారుఢ్య పరీక్షలలో పాల్గొనలేకపోతే అలాంటి వారు జిల్లా ఎస్పీ తమ సమస్యను విన్నవించుకొని తదుపరి తేదీ మార్చుకొనుటకు అనుమతి పొందే అవకాశం ఉందన్నారు.
E.G: గత మూడు రోజులుగా వేతన ఒప్పందం కోసం న్యాయమైన డిమాండ్స్ కోసం పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. ఈ మేరకు రాజమండ్రిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
KMR: సదాశివనగర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం ఏర్పాటు చేశారు. నూతన ఆలయం వద్ద విద్యుత్ అంతరాయం ఏర్పడంతో అయ్యప్ప మాలధారులు కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. MLA నూతన ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించినట్ల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నాయకులు కొబ్బరికాయ కొట్టి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు.
NTR: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ శాఖ అధికారులు పంజా విసిరారు. నందిగామ మండలం కంచల ఇసుక రీచ్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో మైనింగ్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా 4 ఇసుక లారీలు, 2 జేసీబీలను స్వాధీనం చేసుకొని కంచికచర్ల పోలీసులకు అప్పగించారు.
MDK: ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నారాయణరావు పేట మండలం జక్కపూర్లో చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపిన వివరాలు.. జక్కపూర్ గ్రామానికి చెందిన సాగర్ హైదరాబాద్కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. ప్రేమను పెద్దలు అంగీకరించరని అనుమానంతో పురుగు మందు తాగారు. చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడు.
MDK: నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతిరావు, ఎంపీడీవో యాదగిరి, డిఈ రవీందర్ ఉన్నారు.
HYD: సాధరణంగా డ్రంక్ & డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, కౌన్సెలింగ్, చలాన్లు వేస్తారు. కానీ ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ వ్యక్తికి బుద్ధొచ్చేలా చేశారు. తాగొచ్చిన తండ్రిని ఉద్దేశించి కొడుకుతో.. ‘నాన్న.. నాకు నువ్వు కావాలి. నువ్వు మరోసారి తాగి బండి నడపనని ప్రామిస్ చేయ్’ అని తండ్రిని కదిలించేలా ఆమె ప్రమాణం చేయించారు.
NRML: విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని పాక్పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన జిల్లాస్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీల్లో విజేతలుగా నిలిచిన పాఠశాల విద్యార్థులను సోమవారం అభినందించారు. తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.
MNCL: టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు తలపెట్టిన ఛలో హైదరాబాద్కు మంచిర్యాల జిల్లా నుండి పెద్దసంఖ్యలో సంఘం నాయకులు, సభ్యులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. సంఘం కేంద్ర కార్యాలయంలో జరగనున్న డైరీ, క్యాలెండర్ 2025 ఆవిష్కరణలో తాము పాల్గొననున్నట్లు తెలిపారు.
ASF: బెజ్జూర్తో పాటు ఊట్ సారంగపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు అల్పాహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ దండ విటల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు.
TG: తన ఇంటిపై ACB దాడులు చేయబోతుందంటూ మాజీమంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో పోలీసులు దొంగ స్టేట్మెంట్ సృష్టించారు. ఆయనకు జరిగిందే నాకూ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలు నా ఇంట్లో పెట్టి నన్ను ఇరికించే కుట్ర జరుగుతోంది. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు’ అని అన్నారు.
MNCL: ఏఐటీయూసీ శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శిగా అక్కపాక సంపత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ ఆర్కే 7 పిట్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రెటరీ ఎస్కే బాజీసైదా, పిట్ సెక్రెటరీ మారేపల్లి సారయ్య పాల్గొన్నారు.