MBNR: పిడుగు పడి పాడి ఆవు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కిచ్య నాయక్ తండాలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాట్లవత్ మోహన్ తన ఆవులను మంగళవారం సాయంత్రం తన పొలంలో కట్టేసి ఇంటికి వచ్చాడు. ఇవాళ ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా.. పిడుగు పడి ఆవు మృతి చెందింది.