SKLM: ఆమదాలవలస మండలం వెంగల రావు కాలనీలో ఎన్ అపర్ణ అనే గర్భిణి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే అడ్డుకుని ఆమెను 108 అంబులెన్స్ ద్వారా జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. తల్లి, బిడ్డలకు చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.