ADB: జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకునేందుకు ప్రతిరోజు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరుగా FIR నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.