సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ గోకులం వీధిలో అగ్నిప్రమాదం సంభవించి కేశప్ప, లక్ష్మప్ప, సావిత్రమ్మ అనే రైతులకు చెందిన గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి తక్షణమే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఓదార్చి, వారికి వ్యక్తిగతంగా రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేశారు.