ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రికెటర్లను స్పూర్తిగా తీసుకుని చదువు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మైదానంలో బ్యాటర్ల తరహాలో విద్యార్థులు ఒత్తిడిని హ్యాండిల్ చేయాలని ప్రధాని తెలిపారు. పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని టీచర్లు వెలికితీయాలన్నారు.
Akp: చోడవరం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కూటమి నాయకులు ఆ ఫ్యాక్టరీ విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీ.వెంకన్న మంగళవారం ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారన్నారు. సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పారు.
RR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఘటన అమానుషమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేష్ అన్నారు. షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామిని మంగళవారం సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజామనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తికి పలు రకాల పుష్పాలు, తమలపాకుల తోరణాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని యంగ్ స్టార్స్ యూత్‌కి మ్యాకల మల్లికార్జున్ (కానిస్టేబుల్) వాలీబాల్, క్రికెట్ బ్యాట్, క్యారం అందించారు. యూత్ మద్యానికి బానిస కాకుండా అందరు ఆటలు ఆడుకుంటూ ఆరోగ్యంగా వుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరల్ల ధర్మేందర్, బైరగోని నందయ్య, ఎక్కలదేవి శ్రీనివాస్ ఉన్నారు.
SKLM: టెక్కలిలోని అయ్య ప్పనగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతిగృహాన్ని మంగళవారం ఉదయం టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహ పరిసరాలను పరిశీలించారు. వసతిగృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్డీవో సిబ్బందికి సూచించారు.
విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం (D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్ చేసేది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్‌పై ఆటోనగర్ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఆమె కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినది.
NZB: మోపాల్ మండలం నరసింగపల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రానికి మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రానున్నట్లు ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేపౌర్ణమి సందర్భంగా ఒక దివ్య ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఆలయంలో పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సాయంత్రం 4గంటలకు నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారని ఆయన వివరించారు.
VSP: ఆన్ లైన్ లోన్ యాప్స్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు.
BHNG: పూర్వగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా తిరు కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవం భక్తులు తిలకించి తరించారు.
KMRD: దొమకొండలో సోమవారం MLC ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు కార్యకర్తలు శ్రమించాలని సమావేశంలో చర్చించామన్నారు. బీజేపీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడు గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి విభిన్న ప్రతిభా వంతులను గుర్తించాలని నరసన్నపేట జూనియర్ సివిల్ న్యాయాధికారి సీహెచ్. హరిప్రియ అన్నారు. ఉర్లం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
KMRD: జిల్లాలోని ఉద్యోగులందరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని డా.ఫరీదా అన్నారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ JAC అధ్యక్షుడు అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో JACకి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ GGH సూపరింటెండెంట్, RMO సంతోష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అరుణ్, ఉపాధ్యక్షుడు అంజయ్య, మునీర్ ఇక్రమ్ దత్తు ఉన్నారు.
SKLM: సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐఎఫ్ డబ్ల్యూజే) నూతన డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకులు నెహ్రూ స్థాపించిన యూనియన్ ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో డోల అప్పన్న, తిత్తి ప్రవీణ్ కుమార్, బెహరా షణ్ముఖ, తదితరులు పాల్గొన్నారు.