MNCL: రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరించారు. రైతుబంధును చెల్లించాలని కోరుతూ.. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పోస్ట్ కార్డులలో రాసి ప్రభుత్వానికి పంపారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సహాయంగా అమలు చేసిన రైతుబంధు డబ్బులు చెల్లించాలన్నారు.