NZB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న మురికి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడు. మృతుడి జేబులో రూ.4000 నగదు లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.