PLD: నరసరావుపేట (మం) పమిడిపాడులోని పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే చదలవాడ ప్రారంభించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు అందించి, గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్సలు చేశారు.