KDP: పులివెందుల నుంచి ముద్దనూరు వెళ్లే రహదారిపై మడూరు సమీపంలో బుధవారం బైక్ ప్రమాదం జరిగింది. ముద్దనూరు నుంచి వస్తున్న ఆటో,పులివెందుల నుంచి గ్రామానికి వెళ్తున్న బైకు ఢీ కొట్టింది. గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రామచంద్రుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని 108లో ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.