• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మహిళల అక్రమ రవాణాను అరికట్టాలి’

KMM: బోనకల్ రైతు వేదికలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో సీడీపీఓ బాల త్రిపుర సుందరి మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా, సైబర్ నేరాలు, బీఎన్ఎస్, ITPA, POCSO చట్టాలు, 1098, 1930, 100 టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించారు. ప్రేమ, పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మహిళలను వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని తెలిపారు.

March 18, 2026 / 06:47 PM IST

పొన్నూరులో ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం

GNTR: సహస్ర లింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో అమర్నాథ్ తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉచితంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భక్తులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 18, 2026 / 06:47 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పున్న శైలజ పాల్గొన్నారు. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు ఘనంగా సన్మానం చేశారు.

March 18, 2026 / 06:45 PM IST

గ్రామాల్లో భయం.. అటవీశాఖ నిఘా..!

KMR: మమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ శివారులో ఎలుగుబంటి మంగళవారం కనిపించడంతో గ్రామాల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బుధవారం ఎలుగుబంటి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

March 18, 2026 / 06:44 PM IST

మాజీ ఎమ్మెల్యేకు బెయిల్

AP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుల జంట హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ-6 నిందితుడిగా ఆయన ఉన్నారు. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

March 18, 2026 / 06:43 PM IST

‘లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి’

SRCL: జిల్లాలోని అన్ని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. ముందుగా వ్యవసాయ, గృహ, విద్య రుణాలపై సమీక్ష నిర్వహించారు.

March 18, 2026 / 06:38 PM IST

నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ఎస్పీ నరసింహ ఐపీఎస్ నెలవారీ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా శాంతిభద్రతలు, మహిళా భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

March 18, 2026 / 06:38 PM IST

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన 

AP: వచ్చే ఏడాది ఉగాది తర్వాత 2 నెలల్లోనే పోలవరం పూర్తి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. మిగిలిన పనుల కోసం మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయడంతో పాటు, యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.

March 18, 2026 / 06:37 PM IST

‘ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

MDK: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలకు మెమో జారీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. నర్సాపూర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.. అంగన్వాడి ఉద్యోగులకు ప్రభుత్వం మెమో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

March 18, 2026 / 06:36 PM IST

‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించిన కలెక్టర్

W.G: భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వారు వివరించారు. దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు

March 18, 2026 / 06:36 PM IST

‘రెండో విడత నిధులు విడుదల చేయాలి’

KNR: జమ్మికుంట మండలంలో దళితబంధు రెండో విడత నిధులను తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో పద్మకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన నిధుల జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చిలివేరు శ్రీకాంత్ పాల్గొన్నారు.

March 18, 2026 / 06:36 PM IST

నెక్ట్స్ డీజీపీ ఎవరు..?

TG: కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్రప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను యూపీఎస్సీ పంపించింది. యూపీఎస్సీ జాబితాలో సీపీ ఆనంద్, సౌమ్య మిశ్రా, ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. వీరిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న శివధర్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.

March 18, 2026 / 06:35 PM IST

రోడ్డు పనుల నాణ్యత తనిఖీ..!

AKP: రావికమతం నుంచి గుడ్డిప వరకు నిర్మాణంలో ఉన్న రహదారి పనులను ఉమ్మడి విశాఖ జిల్లా క్వాలిటీ కంట్రోల్ డీఈ వేణుగోపాల్ బుధవారం తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం బ్లాక్ మెటల్ వినియోగం, మందం, రోడ్డు వెడల్పు వంటి అంశాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉపయోగించిన క్వారీ బుగ్గి నాణ్యతను కూడా పరీక్షిస్తామని తెలిపారు. వ్యత్యాసాలు ఉంటే రికవరీ చేస్తామని హెచ్చరించారు.

March 18, 2026 / 06:35 PM IST

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

BPT: పెదకూరపాడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో బుధవారం కలెక్టర్ కృతికా శుక్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విధులు సరిగా నిర్వర్తించకపోవడం వలన సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎలాంటి లోపాలు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 18, 2026 / 06:34 PM IST

రైతుల సంక్షేమమే ధ్యేయం

CTR: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలం గుట్టపల్లే వెటర్నరీ కేంద్రం వద్ద చాప్ కట్టర్లను రైతులకు బుధవారం పంపిణీ చేశారు. పాడి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. రైతులకు రాయితీపై పలు పరికరాలను అందిస్తున్నామన్నారు.

March 18, 2026 / 06:34 PM IST