SRPT: నాగారం(మం) నాగారం బంగ్లాలో కొత్తగా నిర్మించిన ఈద్గాను ఎమ్మెల్యే సామేలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈద్గాను తన సొంత నిధులతో నిర్మించడం జరిగిందన్నారు. ఈద్గా అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క సూచనల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవిచందర్, నాయకులు తదితరులున్నారు.
WNP: పాన్ గల్(మం) శాఖాపూర్ తండా సర్పంచ్ నాగేష్ గ్రామ యువత క్రీడల్లో ప్రతిభ చాటుకునేలా యువకుల కోసం ప్రత్యేకంగా బాక్స్ క్రికెట్ మైదానం నిర్మాణం పనులు చేపట్టారు. పిచ్ ప్రాంతంలో దృఢమైన కాంక్రీట్ మాల్ వేయిస్తూ, చుట్టూ ఇనుప పైపులతో ఆధునిక సదుపాయాలు కలిగిన మైదానాన్ని రూపుదిద్దిస్తున్నారు. పనులు త్వరలోనే పూర్తి చేసి, ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
W.G: భీమవరం కలెక్టర్ ఆఫీస్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలలో సాహితీవేత్త, అక్షర కిరీటి తెన్నేటి మాస్టారుకు “ప్రభుత్వ ఉగాది సాహితీ పురస్కారం”ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం తెన్నేటి మాస్టారు స్వీయ కవితాసంపుటి “తెలుగు లోకం” పుస్తకాన్ని నాగరాణి, DEO నారాయణ ఆవిష్కరించారు.
E.G: కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. ఉగాది కానుకగా యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేశామని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.
సత్యసాయి: గోరంట్ల మండలం పూలేరు పంచాయతీ పరిధిలోని కొత్తబయన్నపల్లి గ్రామంలో NREGS పథకం కింద రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు గురువారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోరంట్ల టీడీపీ కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
NLG: చండూరు(మం) తుమ్మలపల్లిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయపల్లి రాజు మాట్లాడుతూ.. రహదారి నిర్మాణంతో గ్రామస్థులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో బురద సమస్య తప్పుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిర్మల, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చింతకాయల రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పండితులు నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్ లేకపోవడంపై కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. ‘మేమెప్పుడూ సంజూ స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు. రోహిత్, విరాట్‌ను ఎవరైనా భర్తీ చేయగలరా? సంజూ విషయంలోనూ అంతే. ఆయన్ను ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఈ సీజన్‌లో మా దృష్టి అంతా అత్యుత్తమ ప్రణాళికతో బరిలోకి దిగడం, విజయంపైనే ఉంది. గతేడాది మేం అనుకొన్న విధంగా ఆడలేకపోయాం’ అని తెలిపాడు.
NDL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో దేవస్థానం అలంకార మండపంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
HNK: ఐనవోలు మండలం ములకలగూడెం జరిగిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన జక్కుల రాజు గురువారం మొలకలకుంట చెరువులో గొర్రెలను కడుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనపై ఆయన భార్య జక్కుల రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
AP: జాబ్ క్యాలెండర్ విడుదల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 22 నెలల్లో ప్రభుత్వం 6.5 లక్షల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో విద్య, పోలీసు శాఖలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
PPM: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలోని మన్యం కళావేదికలో శ్రీపరాభావ నామ సంవత్సరం ఉగాది వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు వేద పండితులు పూర్ణకుంభంతో వేద మంత్రొచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు.
TG: రాష్ట్రమంతా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పండించాలని.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్న కలలు నిజమౌతావని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. కేంద్రం పామాయిల్‌ను లక్ష కోట్ల టన్నుల దిగుమతి చేసుకుంటుందని.. ఎంత మంది పండించినా.. ఏం కాదని భరోసా ఇచ్చారు. అందుకే రైతులందరూ పామాయిల్ పంట సాగు చేయాలని సూచించారు.
BHNG: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో గర్భిణీ సురక్షితంగా ప్రసవించింది. అడ్డగూడూరు మండలంలోని చిర్ర గూడూరుకు చెందిన మనీషాకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పురిటి నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటి యాకస్వామి చాకచక్యంగా అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు.