అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
RR: బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఊపిరి పోయాలి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో దళిత విభాగం నాయకులు జాంగారి రవి, అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై నివాళులర్పించారు.
NTR: విజయవాడకు చెందిన 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతూ HCG క్యాన్సర్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి పటాన్ చెరుకి “సింహ వాహిని ఫౌండేషన్” రూ. 37,050 సహాయం అందించింది.ఈ ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యులతో కలిసి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ వీరికి తోడుగా నిలవాలని వంశీ రెడ్డి కోరారు.
HYD: రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: GHMC పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది. హై రైజ్ భవనాలు సైతం క్రితం కంటే తగ్గాయి.
SKLM: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రణస్థలం సర్పంచ్ భానోజీ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉదయం రణస్థలం గ్రామంలోని కరిమజ్జి వీధిలో సర్పంచ్ నేతృత్వంలో పంచాయతీ అధికారులు సమక్షంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. వీధుల్లో కాలువలను శుభ్రం చేయించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా ఉంచి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల నేపథ్యంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకపోకలు సాగించే సుమారు 10 రైళ్ల గమ్యస్థానాలను ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ క్రమంలో స్టేషన్‌కు వచ్చే రైళ్లను చర్లపల్లి, కాచిగూడకు తరలించనున్నారు.
ATP: ధర్మవరంలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శనివారం పరిశీలించారు. అనంతరం క్యాంటీన్‌లో ఉదయం కమిషనర్ టిఫిన్ చేశారు. క్యాంటీన్‌కు వచ్చిన వారిని టిఫిన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
మన్యం: జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మవలస గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఎవరూ ఏనుగుల వద్దకు వెళ్లొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. రోడ్లపైకి ఏనుగులు వచ్చేటప్పుడు వాహనదారులు చూసుకుని వెళ్లాలని కోరారు. గ్రామాలలో ఏనుగులు తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
TG: ట్రాఫిక్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే యజమానికి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే వాహన RCని కూడా 12 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. సదరు మైనర్‌కు 25 ఏళ్లు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు.
KDP: సింహాద్రిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ స్వర్ణలత తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ సిలబస్ బోధన ఉంటుందన్నారు.
ప్రకాశం: వేర్వేరు కారణాలతో శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. పెద్ద దోర్నాల మండలంలోని గుంటవానిపల్లె సమీపంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో ఢీకొనటంతో రైతు మృతి చెందాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం, గిద్దలూరులో వేరువేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
KRNL: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఉంటాయని TDP ఆలూరు ఇన్ ఛార్జ్ వీరభద్రగౌడ్ అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబును శుక్రవారం రాత్రి కలిసి నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగు, సాగు నీటికష్టాలను తీర్చాలని సీఎంను కోరారు.
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి, సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, పేదరికం నిర్మూలనకు చదువు ఒక ఆయుధమని అన్నారు.
కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణ మూర్తి శుక్రవారం తెలిపారు. 5వ తేదీ శనివారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు భధ్రాచలంకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయన్నారు. తిరిగి 6వ తేదీ స్వామి వారి కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 1:00 గంట నుండి అందుబాటులో ఉంటాయన్నారు.