మన్యం: జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మవలస గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఎవరూ ఏనుగుల వద్దకు వెళ్లొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. రోడ్లపైకి ఏనుగులు వచ్చేటప్పుడు వాహనదారులు చూసుకుని వెళ్లాలని కోరారు. గ్రామాలలో ఏనుగులు తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.