MHBD: మరిపెడ మండలం తానంచర్ల గంగమ్మ ఆలయాన్ని నేడు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు ఆలయంలో భక్తులతో కలిసి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
WNP: జిల్లా కేంద్రంలోని 22వ వార్డు బాలాజీ నగర్‌లో గల కుట్టు శిక్షణ కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకురాలు హసీనాతో శిక్షణ కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రామానంద తీర్థ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కేంద్రంను ఏర్పాటు చేశారని, నేటి వరకు 3 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణను ఇచ్చామని తెలిపారు.
MBNR: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాషాబుగుట్ట హైస్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు, క్లాస్ రూమ్స్, వంటశాల, స్టోర్‌రూంను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన త్రాగునీరు, పరిసరాలు, భోజనంలో పరిశుభ్రత పాటించాలన్నారు.
E.G: జిల్లాలో కల్లు గీత కులాల వారికి కేటాయించిన 13 మద్యం షాపులకు శనివారం గడువు ముగిసే సమయానికి 387 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. ఆదివారం మద్యం షాపుల దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 12న రాజమండ్రి DRDO కార్యాలయం వద్ద మద్యం షాపులకు లాటరీ తీస్తామన్నారు. అనంతరం షాపులు కేటాయిస్తామన్నారు.
MLG: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న ట్రామా సెంటర్, స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ రెండు సెంటర్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు బయలుదేరుతుంది.
NGKL: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్కతో కలిసి ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావలసిన వెనుకబాటు జిల్లాల ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు.
బాపట్ల: మండలం నరసాయపాలేనికి చెందిన ప్రముఖ గాయని కారుమంచి కోటిరాజ్(88) శనివారం మృతి చెందారు. ఈమె సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈమె ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆమె పలు సినిమాలకు పాటలు కూడా పాడారు. బాపట్ల జమేదారుపేటలో సప్తస్వర సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు.
NTR: ఈనెల 11నుంచి జరిగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సత్కరించి చిత్రపటం అందజేశారు.
E.G: కడియం మండలం దుళ్లలో గల శ్రీదేవి, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంబరాన్నంటాయి. శ్రీవారికి ప్రీతికరమైన గరుడ వాహనంపై దుళ్ల గ్రామ వీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు, ఉప సర్పంచ్ టి.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
KRNL: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో శనివారం సందడిగా మారింది.సెలవు దినం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం, మహాముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నది తీరాలు భక్తులతో భరితమయ్యాయి. వారు పుణ్యస్నానాలు చేసి మంచాలమ్మను దర్శించి స్వామి బృందావనంలో పూజలు చేశారు.
కృష్ణా: ముసునూరు మండలం రమణక్కపేట విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్టు నుంచి ఎంపికైనట్లు పీడీ డాక్టర్ వాకా నాగరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రమణక్కపేట జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థినులు టి. నాగసుధ, డి. భార్గవిలు ఎంపికైనట్లు చెప్పారు. పిఠాపురంలో ఏపీ అండర్-16 రాష్ట్రస్థాయి యూత్ పోటీలు ఈనెల 11న జరుగుతున్నాయని అన్నారు.
సత్యసాయి: మడకశిర సీఐ రాగిరి రామయ్య తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని గాయత్రి అనే మహిళ జిల్లా SP రత్నకు ఫిర్యాదు చేశారు. బంధువులతో జరిగిన గొడవ విషయంలో స్టేషన్‌కు వెళ్లగా సీఐ తనను గదిలోకి పిలిపించి మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అంటూ అసభ్యంగా మాట్లాడారని వాపోయారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.
KRNL: పత్తికొండలోని మండగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే శ్యాంబాబు ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. 1950లో ప్రారంభమై 75 సంవత్సరాల తర్వాత సిజేరియన్ కాన్పు పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వైద్యుల విజ్ఞప్తి మేరకు ఆయన ఏర్పాటు చేయించారు. అగ్రహారంకు చెందిన పద్మకు మొదటి సిజేరియన్ చేయగా సక్సెస్ అయ్యింది ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పనులు నిలిచిపోయాయని తెలిపారు.