TPT: నాగలాపురం మండలంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. నిన్న ఉదయం ప్రత్యేక పూజలు, మహాశాంతి హోమం నిర్వహించి, సాయంత్రం గరుడవాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం చేపట్టారు. మత్స్యకారులు ఇరుముడులతో పాల్గొని భక్తి చాటగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
VKB: భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎంఎస్‌పీ (MSP) జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై అవగాహన కోసం చేపట్టిన 23 రోజుల యాత్ర శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద యాత్రకు ఘన స్వాగతం పలికారు.
WNP: గోపాల్ పేట మండలం, చిట్యాల గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్లను పోలీసులు గుర్తించి తిరిగి అందజేశారు. CEIR పోర్టల్ సహాయంతో ఫోన్లను ట్రేస్ చేసిన ఎస్ఐ జగన్ మోహన్ శనివారం బాధితులకు వాటిని అప్పగించారు. ఫోన్లు తిరిగి లభించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ ధరలు పెరగడంతో మాంసాహార ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ చికెన్ ధర రూ. 320 ఉండగా, విత్ స్కిన్ రూ. 300 పలుకుతోంది. కేజీ మటన్ ధర రూ. 960 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే.. కొరమేను రూ. 430, బొచ్చెలు రూ. 230లుగా ఉన్నాయి.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.350 నుంచి 360 పలుకగా.. కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 310 నుంచి 320 వరకు పలుకుతుంది. అలాగే కేజీ మటన్ ధర రూ.700 నుంచి 750 వరకు పలుకగా.. కేజీ మేక మాంసం ధర రూ. 800 నుంచి 850 వరకు మాంసం విక్రయదారులు తెలిపారు. మీ ప్రాంతాల్లో చికెన్ ధరలు కామెంట్ చేయండి.
PPM: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25న పార్వతీపురంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి సాయి కృష్ణచైతన్య తెలిపారు. గాయత్రి కళాశాలలో జరిగే ఈ మేళాకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారు హాజరు కావచ్చన్నారు. పూర్తి వివరాలు కొరకు వెబ్‌సైట్‌ను చూడొచ్చని తెలిపారు.
ప్రకాశం: చీమకుర్తిలో ఈ నెల 31వ తేదీన తిరుణాళ్లు నిర్వహించనున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు. సాయంత్రం సమయాల్లో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తిరుణాల మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
భువనగిరి: నేడు భువనగిరికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్న పేట మల్లేశం తెలిపారు. జనవరిలో నిర్వహించిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడలో గెలిచిన వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యఅతిథిగా బహుమతులు ప్రధానం చేస్తారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మంత్రి బీఎల్ వర్మ వస్తున్నట్లు తెలిపారు.
KRNL: ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.310, స్కిన్‌లెస్ రూ.340 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-20 వరకు పెరిగాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కోళ్లు ధరలు పెరగడంతో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారస్తులు అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లిలో మల్లేశ్ కుటుంబం ఊరెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు దాడి చేశారు. దుండగులు బీరువా పగలగొట్టి అరతులం బంగారం, 15 తులాల వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై భయానికి లోనయ్యారు.
KDP: ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ.300, స్కిన్‌లెస్ చికెన్ రూ.342, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
కమిన్స్ వచ్చేవరకు IPL 2026లో SRHను ఇషాన్ నడిపించనున్న సంగతి తెలిసిందే. సారథిగా అతనికి మంచి రికార్డే ఉంది. కెప్టెన్‌గా 29 మ్యాచుల్లో 24 విజయాలు అందుకున్నాడు. SMAT 2025లో 11 మ్యాచులకు ఒక్కటే ఓడాడు. జట్టు భారం తనపై ఉన్నా బ్యాట్‌తో ఎక్కడా తగ్గకుండా 43.12 సగటుతో 7 సెంచరీలు చేశాడు. మరి అతని కెప్టెన్సీ స్టైల్ SRHకు పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ADB: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం దక్కుతుందని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం మండల అధ్యక్షులతో శనివారం సమావేశమై మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకాలలో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.