ఇటీవల భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌ను ఆదుకోవడానికి క్వాడ్ దేశాలు ముందుకొచ్చాయి. మయన్మార్‌లోని సంక్షోభ పరిస్థితులపై భారత్, US, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ 20 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. కాగా, గత నెల 28న థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూకంపం వల్ల 3 వేలకుపైగా మరణించారు.