మన్యం: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను శుక్రవారం UTF రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ రావు కలసి పాఠశాల విద్యారంగ సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులను ఇతర పాఠశాలల్లో విలీనం చేయవద్దని.. 6,7,8 తరగతులను ఎత్తివేయకూడదని కోరారు. ముఖ్యంగా తెలుగు-ఇంగ్లీష్ మాధ్యమాలను కొనసాగించాలని కోరారు.