KDP: పులివెందుల పట్టణంలోని చిన్న రంగాపురం గ్రామ సమీపంలోని కోతి సమాధి వద్ద శుక్రవారం గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నామని అర్బన్ సీఐ నరసింహులు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన పట్టుబడిన యువకుడు మల్లికార్జున మీడియా ఎదుట హాజరు పరిచారు. మల్లికార్జున జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తూ జీవనం గడుపుతున్నాడన్నారు.