అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చు వారి పల్లెకు చెందిన వైసీపీ నేత రెడ్డి రాజులు ఆకస్మిక మరణం చెందారు. ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి నిస్సార్ అహ్మద్ ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రెడ్డి రాజుల మృతి పార్టీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.