AP: లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల కసిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వగా.. వీటిని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. కసిరెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.