E.G: గండేపల్లి మండలం మురారి గ్రామంలో శుక్రవారం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పాల్గొని రూ.1.5 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.