కోనసీమ: మండపేట కొత్త బస్టాండ్ వద్ద IFTU ఆధ్వర్యంలో రైస్ మిల్లు కార్మికులతో సమ్మె సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మే 20వ తేదీన జరిగే కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.