ASR: అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. మండలంలోని రైతులు ఈనెల 16వ తేదీలోగా తమ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ భూమి పట్టా పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, పోడు పట్టాలను తీసుకుని ఆర్ఎస్కేలను సంప్రదించాలని సూచించారు.