కృష్ణా: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గురువారం మచిలీపట్నం వచ్చారు. ఉయ్యూరులో జరిగే ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మచిలీపట్నం R&B గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. దీంతో పలువురు MRPS నాయకులు మంద కృష్ణ మాదిగను కలిశారు. ముందుగా ఆయన మచిలీపట్నం ఆర్డీవో స్వాతి నివాసానికి వెళ్లి ఆమె ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు.