కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో బీసీ కార్పొరేషన్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు.