VZM: బొండపల్లి మండలంలో ఉపాధి పనులకు వెళ్లే వేతనదారుల సంఖ్య పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నామని ఏపీవో జి అరుణ కుమారి తెలిపారు. గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. ప్రస్తుతం 8,124 మంది వేతన దారులు ఉపాధి పనులకు వస్తున్నారని, సంఖ్యను తొమ్మిది వేలకు పెంచాలని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు లక్ష్యం విధించామన్నారు.